BJP: కర్ణాటక ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని బోరున విలపించిన బీజేపీ నేత

  • త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • పోటీకి దిగనున్న బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
  • తన పేరు లేకపోవడంతో శశిల్ జీ నమోషి మనస్తాపం
  • ఓదార్చినా ఊరుకోని వైనం

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దింపే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం నిన్న విడుదల చేసిన విషయం విదితమే. పోటీకి దిగనున్న 82 మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో బీజేపీ నేత శశిల్ జీ నమోషి మనస్తాపానికి గురయ్యారు. గుల్బర్గా నియోజకవర్గం నుంచి టిక్కెట్ వస్తుందని ఆశించిన తనకు కాకుండా, సీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

అయితే, మాట్లాడడం ప్రారంభించగానే ఆయన భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. శశిల్ జీ నమోషి మద్దతుదారులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కన్నీరు ఆగలేదు. దీంతో ఆయన మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు. 

BJP
Karnataka
elections
  • Error fetching data: Network response was not ok

More Telugu News