anam viveka: ఆనం రాంనారాయణ వైసీపీలో చేరుతారని వార్తలు.. స్పందించిన ఏపీ మంత్రి సోమిరెడ్డి

  • ఆయన వైసీపీలో చేరుతున్నారని మేము అనుకోవడం లేదు
  • పార్టీలోనే కొనసాగుతారు
  • అనుమానం అవసరం లేదు

గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్‌ అయిన నెల్లూరు సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి ఇప్పుడు వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీలో చేరుతున్నారని తాము అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీలోనే కొనసాగుతారని, అందులో అనుమానం అక్కర్లేదని అన్నారు. కాగా, మరోవైపు అనారోగ్య సమస్యలతో ఆనం వివేకానందరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతోన్న విషయం విదితమే.

anam viveka
anam ram narayana
somireddy
  • Loading...

More Telugu News