Andhra Pradesh: పరస్పర సహకారంతో సీఎఫ్ఎంఎస్ లో సమస్యలను పరిష్కరించుకోవాలి!: ఏపీ సీఎస్ దినేష్

- సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థపై సీఎస్ సమీక్ష
- పెండింగ్ బిల్లులను త్వరలో పరిష్కరిస్తాం
- ఈ నెల 24 నాటికి అన్ని శాఖల వారు డేటా అప్ లోడ్ చేయాలి
ఆర్థిక శాఖ, ఇతర శాఖల పరస్పర సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సూచించారు. సచివాలయం 5 బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ పనితీరు, ప్రాథమికంగా తలెత్తే సమస్యలను ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, కొన్ని శాఖలలో ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలో పరిష్కరిస్తారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నాటికి అన్ని శాఖల వారు డేటాను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.