srireddy: పవన్ కల్యాణ్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి

  • పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి
  • వెంటనే క్షమాపణ చెప్పాలని కేతిరెడ్డి డిమాండ్ 
  • ఆమె మాటలు సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి

పవన్ కల్యాణ్ పై దిగజారుడు వాఖ్యలు చేసిన శ్రీశక్తి (శ్రీరెడ్డి) వెంటనే క్షమాపణ చెప్పాలని సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మిమ్మల్ని తప్పు జరిగితే పోలీసుల వద్దకు వెళ్లమనడం తప్పా?.. మహిళా సమస్యలపై పోరాటం చేస్తూ, ఆ అమ్మాయికి బాసటగా ఉన్న మహిళా నేతలందరు సమాజం తలదించుకునే విధంగా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పాలి. పెద్ద వారిని తిట్టినంత మాత్రాన మనం పెద్ద వాళ్ళం అవుతామా?.. ఈరోజు పవన్ కల్యాణ్.. రేపు చంద్రబాబు నాయుడు, ఎల్లుండి జగన్, కేసీఆర్ లను ఉద్దేశించి మాట్లాడదని గ్యారంటీ ఏంటీ?.. ఇది శాంతి భద్రతల సమస్య కాకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' అంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

srireddy
Jagan
Chandrababu
KCR
Pawan Kalyan
Hyderabad
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News