saipallavi: తల్లితోను .. చెల్లితోను సాయిపల్లవి సెల్ఫీ!
- తెలుగులో సాయిపల్లవికి మంచి క్రేజ్
- తమిళ ప్రేక్షకుల్లోను అదే ఇమేజ్
- కుటుంబ సభ్యులతో గడపడమే ఇష్టం
తెలుగు .. తమిళ భాషల్లో సాయిపల్లవికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తన పాత్రకి ప్రాధాన్యత .. ఆ పాత్రకి ఓ వ్యక్తిత్వం ఉంటేనే చేయడానికి సాయిపల్లవి అంగీకరిస్తుంది. పాత్ర నచ్చకపోతే రెమ్యునరేషన్ ద్వారా సాయిపల్లవిని ఒప్పించలేమనే విషయం ఇప్పటికే దర్శకనిర్మాతలకు అర్థమైపోయింది.
సినిమాల్లో పెద్దగా మేకప్ లేకుండా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో ... బయట కూడా ఆమె అంతే సింపుల్ గా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ హోదాను చూపించడం కన్నా .. కుటుంబసభ్యులతో కలిసి సాధారణంగా జీవించడంలోనే అసలైన ఆనందం ఉంటుందనేది ఆమె అభిప్రాయం. ఇదిగో.. తల్లి రాధా కన్నన్ ..చెల్లెలు పూజా కన్నన్ తో సాయిపల్లవి దిగిన ఈ సెల్ఫీ అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలోను .. సినిమా ఫంక్షన్స్ లోను ఎక్కువగా కనిపించని సాయిపల్లవి, సాధారణమైన జీవితాన్ని ఇష్టపడటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.