Sri Reddy: శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు విని మనసు బాధపడింది: సంపూ

  • పవన్ తల్లిని నిందించడం సరికాదు
  • సభ్య సమాజం దీన్ని హర్షించదు
  • సాటి మహిళను గౌరవించని పోరాటంలో అర్థమేంటి?
  • నటుడు సంపూర్ణేష్ బాబు

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు విని తన మనసు చాలా బాధపడిందని నటుడు సంపూర్ణేష్ బాబు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ పెడుతూ, జనసేన అధినేత పవన్ ను, ఆయన తల్లిని నిందించడం సరికాదని అన్నాడు. "పవన్ కల్యాణ్ గారిని, వారి తల్లిని కొందరు నిందించటం మనసుకి బాధ కలిగిస్తోంది. సభ్య సమాజం దీన్ని హర్షించదు. సాటి మహిళని గౌరవించలేనప్పుడు ఈ పోరాటంలో అర్థమే లేదు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా" అని అన్నాడు. నిన్నటి ప్రెస్ మీట్ లో శ్రీరెడ్డి, పవన్ తల్లిని అసభ్యంగా దూషించిన తరువాత, మెగా ఫ్యాన్స్ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.

Sri Reddy
Sampoornesh Babu
Pawan Kalyan
  • Loading...

More Telugu News