Pawan Kalyan: నన్ను తిడితే మీకు బాధగా వుంటుంది... కానీ భరిద్దాం: పవన్ పాత వీడియోను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్!

  • పవన్ ను టార్గెట్ చేసిన మహిళా నటులు
  • ఓ వైపు మండిపోతున్న ఫ్యాన్స్
  • మరోవైపు పాత వీడియో వైరల్
  • భరిద్దామని విజ్ఞప్తి చేస్తున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ మహిళా నటులు చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత నటి శ్రీరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో ఓ వైపు పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్న వేళ, మరికొందరు ఫ్యాన్స్ ఆయన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. "ఒక్కోసారి నన్ను తిడుతుంటే అది మీకు అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం. భరిద్దాం. భరించినవాడే సాధించగలడు. అంతేగానీ మనం... మాట అనేశారు అనిచెప్పి పారిపోతే ఎట్లా? అలా పారిపోవద్దు దేన్నుంచీ.

అలాగని చెప్పి ఎదురుదాడి చేయవద్దు. భరించండి. అలా చూడండి. ఎంతసేపు అంటుంటే అంతసేపు చూడండి. మార్పు దానంతట అదే చాలా సైలెంట్ గా వచ్చేస్తుంది. భరించడం వల్ల చాలా బలమైన శక్తి లోపలి నుంచి వస్తుంది. మనం తప్పు చేయకుండా, మనల్ని అంటుంటే, చాలా బాధ ఉంటుంది. చాలా కోపం ఉంటుంది. చాలా ఆవేదన ఉంటుంది. నాక్కూడా కచ్చితంగా ఉంటుంది. చాలా బాధ ఉంటుంది. భరిద్దాం" అని పవన్ జనసేన కార్యకర్తల ముందు చేసిన ప్రసంగం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

Pawan Kalyan
Old Video
sri Reddy
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News