Haribabu: నా రాజీనామాకు కారణమిదే: కంభంపాటి హరిబాబు

  • నిన్న రాజీనామా లేఖను అమిత్ షాకు పంపిన కంభంపాటి
  • యువకులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే రాజీనామా
  • వారికి అవకాశాలు దగ్గర చేయాలని వినతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రమే ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. వచ్చేది ఎన్నికల సంవత్సరమని తన లేఖలో గుర్తు చేసిన కంభంపాటి, యువకులను ప్రోత్సహించాలన్నది తన అభిమతమని, వారికి అవకాశాల కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.

తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ప్రతి ఒక్కరినీ కలుపుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా, ఈ రాజీనామాపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

Haribabu
Kambhampati
Resign
Amit sha
  • Loading...

More Telugu News