chattishgarh: కిడ్నాప్ చేసిన తెలుగు ఇంజినీర్‌ను హత్య చేసిన మావోలు!

  • రెండు రోజుల క్రితం ఇంజినీర్ కిడ్నాప్
  • అత్యంత దారుణంగా హత్య చేసి పడేసిన మావోలు
  • తూర్పుగోదావరి జిల్లాలో విషాదం

చత్తీస్‌‌గఢ్‌లోని సుకుమా జిల్లా పైదగూడ దగ్గర రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజినీర్ బాలనాగేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. బాలనాగేశ్వరరావు సహా మరో ముగ్గురు కార్మికులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు అదే రోజు కార్మికులను వదిలిపెట్టారు. ఇంజినీర్‌ను మాత్రం తమతో పాటే ఉంచుకుని, సోమవారం అతడిని అతి దారుణంగా చంపి పడేశారు.

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన బాలనాగేశ్వరరావు (60)ను  రోడ్డు పనులను పర్యవేక్షిస్తుండగా మావోలు కిడ్నాప్ చేశారు. సోమవారం ఉదయం చత్తీస్‌గఢ్ రాష్ట్రం కిష్టారం-కాచారం అటవీ గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఆయన మృతదేహం కనిపించింది. బాలనాగేశ్వరరావు మృతి విషయం తెలిసి అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

chattishgarh
Maoists
Engineer
Andhra Pradesh
  • Loading...

More Telugu News