Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు క్షమాపణలు చెప్పిన మహిళా నటులు!

  • పవన్ కల్యాణ్ పై చేసిన ఆరోపణలకు మహిళా నటుల క్షమాపణ
  • అభిమానుల పేరిట ఆడుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరిక
  • పవన్ తన అభిమానులను అదుపులో ఉంచుకోవాలని సూచన

జనసేన పార్టీ అధినేత, అగ్ర హీరో పవన్ కల్యాణ్ పై మహిళా నటులు శ్రుతి, మాధవీలత ఆరోపణలు, విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహిళా నటులు తమ క్షమాపణలు చెప్పారు. 'తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’ అంశంపై రెండో రోజూ చర్చా కార్యక్రమం నిర్వహించారు.  హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా నటులు పవన్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

 సినీ పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలపై తాము గళం విప్పుతుంటే, అభిమానుల పేరుతో కొందరు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించిన మహిళా నటులు, పవన్ తన అభిమానులను అదుపులో ఉంచుకోవాలని సూచించారు.

Pawan Kalyan
lady artists
  • Loading...

More Telugu News