disco shanthi: అందుకే రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను: డిస్కో శాంతి

  • మళ్లీ నటించే అవకాశం వుంది 
  • గుంపులో గోవింద పాత్రలు చేయను 
  • ఈ నిర్ణయానికి రావడానికి కారణమదే

కొంతకాలం క్రితం తెలుగు తెరపై సందడి చేసిన డిస్కో శాంతి, శ్రీహరితో వివాహం తరువాత సినిమాలను పక్కన పెట్టేశారు. శ్రీహరి మరణం ఆమెను మానసికంగా బాగా కుంగదీసింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ షాక్ నుంచి బయటికి వస్తున్నారు. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతుండగా రీ ఎంట్రీకి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.

అప్పుడామె స్పందిస్తూ .. "ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదుగానీ, తెలుగు తెరపై మళ్లీ నన్ను చూసే అవకాశాలు వున్నాయి. గుంపులో గోవింద అనిపించే పాత్రలు మాత్రం చేయను .. అంత అవసరం లేదు కూడా. ప్రాధాన్యత కలిగిన మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా వున్నాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు .. అందువలన ఇప్పుడు చేయవచ్చని అనుకుంటున్నాను. మళ్లీ నటన వైపుకు వెళ్లడం వలన నలుగురిని కలవడం .. మాట్లాడటం జరుగుతుంది. మనసుకి కాస్త ఊరట కలుగుతుందనే ఉద్దేశంతోనే అటుగా ఆలోచిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.      

disco shanthi
  • Loading...

More Telugu News