Priya varior: మొన్న కన్ను కొట్టి... నేడు చీరలో మెరిసి... ప్రియా వారియర్ ను చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • చీర కట్టుకుని ఫొటో దిగిన ప్రియా వారియర్
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన మలయాళ బ్యూటీ
  • సూపరంటున్న నెటిజన్లు

ఒక్క కనుసైగతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారి, దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రియా వారియర్, తాజాగా చీరకట్టుకుని ఫొటో దిగి ఫిదా చేసేస్తోంది. ఇటీవలి కాలంలో తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు పలు అంశాలను షేర్ చేసుకుంటున్న ప్రియ, మలయాళ న్యూ ఇయర్ 'విషూ' సందర్భంగా చీరకట్టులో మెరిసిపోయింది.

అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ తన ఓ దీపాన్ని పట్టుకుని కనిపించింది. క్రీమ్ కలర్ లో ఆకుపచ్చని వర్క్, ఎరుపు రంగు బార్డర్ తో సంప్రదాయం ఉట్టిపడేలా ప్రియ కనిపిస్తుండగా, నుదుటన పెట్టుకున్న ఎర్రని బొట్టు ఆమె అందాన్ని మరింతగా పెంచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఫొటోను మీరూ చూడవచ్చు.

Priya varior
Saree
Instagram
Malayalam
  • Error fetching data: Network response was not ok

More Telugu News