Chiranjeevi: 'రంగస్థలం' విలేజ్ సెట్ లో 'సైరా'

  • అల్యూమినియం ఫ్యాక్టరీలో 'సైరా'
  • ఆ తరువాత గ్రామీణ నేపథ్యంలోని సీన్స్ 
  • చకచకా జరుగుతోన్న సన్నాహాలు

ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం 'సైరా' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత షెడ్యూల్ 'రంగస్థలం' విలేజ్ సెట్లో వుండనున్నట్టు తెలుస్తోంది. 'రంగస్థలం' విలేజ్ సెట్ లోనే అదనంగా మరో భారీ సెట్ ను వేయనున్నారట. ఈ భారీ సెట్ తో పాటు విలేజ్ సెట్ ను ఉపయోగించుకోనున్నట్టు చెబుతున్నారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికి .. గ్రామీణ ప్రజలకు సంబంధించిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. గతంలో 'మర్యాద రామన్న' సినిమా కోసం రాజమౌళి వేయించిన ఇంటి సెట్ లోను .. ఆ తరువాత 'ఊ కొడతారా .. ఉలిక్కి పడతారా'లో బాలకృష్ణ భవంతి సెట్ లోను ఆ తరువాత చాలా షూటింగ్స్ జరిగాయి. అలాగే 'రంగస్థలం' కోసం సుకుమార్ వేయించిన విలేజ్ సెట్ లోను ఇతర సినిమాల షూటింగ్స్ జోరుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

  • Loading...

More Telugu News