whatsapp: వాట్సాప్ లో డిలీట్ చేసినా సర్వర్లో ఆ ఫైల్ భద్రం... కావాలంటే మళ్లీ మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
- డిలీట్ చేసిన తర్వాత 30 రోజులు దాటినాగానీ సర్వర్లో ఫైల్స్ భద్రం
- మళ్లీ, మళ్లీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
- బీటా వెర్షన్ దశలో ఫీచర్
వాట్సాప్ లో ఓ ఫైల్ ను డౌన్ లోడ్ చేశారనుకోండి. మళ్లీ కావాలంటే నిశ్చితంగా పొందొచ్చు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు చేరువగా ఉండే ప్రయత్నం చేస్తున్న వాట్సాప్.. డిలీట్ అయిన ఫోల్డర్ ను కూడా మళ్లీ మళ్లీ పొందే అవకాశం కల్పించింది. సాధారణంగా వాట్సాప్ లో ఫైల్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత దాన్ని తిరిగి డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ లేదు. అయితే, తాజా బీటా వెర్షన్ లో మాత్రం వాట్సాప్ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని రోజులుగా డిలీట్ చేసిన మీడియాను తిరిగి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఇస్తోంది. అంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ వాట్సాప్ సర్వర్లో భద్రంగానే ఉంటాయని అర్థమవుతోంది.
అయితే ఈ ఫీచర్ ఇంతకుముందు కూడా వాట్సాప్ లో పార్షికంగా ఉంది. డిలీట్ చేసిన ఫైల్స్ 30 రోజుల వరకు వాట్సాప్ సర్వర్లో ఉండేవి. ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే ఆ తర్వాత వాట్సాప్ సర్వర్ల నుంచి డిలీట్ అయిపోయేవి. అయితే ఈ ఫీచర్లో కంపెనీ మార్పులు చేసింది. డిలీట్ చేసిన ఫైల్స్ వాట్సాప్ సర్వర్ల నుంచి తొలగించకుండా అలానే ఉంటాయి. అంటే మళ్లీ డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. రెండు నెలల క్రితం ఫైల్స్ ను కూడా డౌన్ లోడ్ చేసుకోవ్చని, అంతుకుముందు ఫైల్స్ లో కూడా కొన్నింటిని పొందే అవకాశం ఉంటుందని వాబీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది.