Tollywood: అటువంటి అమ్మాయి నా దృష్టిలో మలినం అంటని పవిత్ర!: ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి

  • ఇష్టం లేక అలా చేసినా పవిత్రులే
  • ఏదైనా చేసే అమ్మాయిలను ఓదారుస్తూ వ్యాఖ్యలు
  • కాస్టింగ్ కౌచ్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న శ్రీరెడ్డి

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించిన నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, ఒక్క అవకాశం లభిస్తే చాలు... అని భావించి ఏదైనా చేసే అమ్మాయిలను ఓదార్చే వ్యాఖ్యలు చేసింది. "మనసుతో పడుకోని ఏ అమ్మాయి అయినా నా దృష్టిలో మలినం అంటని పవిత్ర" అని పేర్కొంది.

అమ్మాయిలు తప్పనిసరై తమ మనసులు చంపుకుని టాలీవుడ్ లో జీవించాల్సి వస్తోందని, నిత్యమూ ఎందరి చేతుల్లోనో నలిగినా కూడా అవకాశాలు లభించేది అంతంతమాత్రమేనని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె ఫిల్మ్ చాంబర్ ముందు చేసిన అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, పలు మహిళా సంఘాలతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం అండగా నిలిచింది. ఇప్పుడు లైంగిక వేధింపులను ఎదుర్కొన్న ఎంతో మంది తమ బాధను బయటకు వెళ్లగక్కుతుంటే, టాలీవుడ్ లో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనన్న ఆందోళన నెలకొని ఉంది.

Tollywood
Casting Couch
Sri Shakti
Sri Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News