palaniswami: వేరొకర్ని కాపాడేందుకు... జయలలిత ఆరోగ్యంపై మాజీ సీఎస్ తప్పుడు సమాచారం ఇచ్చారు: సీఎం పళనిస్వామి
- కావేరీ సమస్య ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా పరిష్కారం కాదు
- చట్టప్రకారం నడవాల్సి ఉంటుంది
- ప్రదానికి మెమో ఇచ్చాను
‘అమ్మ’ మరణంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. చెన్నై ఎయిర్ పోర్టులో ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై మాజీ చీఫ్ సెక్రటరీ పి.రామ్మోహన్ రావు తప్పుడు సమాచారం అందించారని తెలిపారు. వేరొకరిని కాపాడేందుకు ఆయన అలా చేశారని ఆయన చెప్పారు. ఈ వేరొకరు ఎవరు? అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు.
తమిళనాడులో రాజుకుంటున్న కావేరీ నదీ జలాల సమస్య ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా పరిష్కారమయ్యేది కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చట్టపరంగా వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కావేరీ ఘటనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ మే 3 కల్లా కేంద్రం ముసాయిదాను రూపొందించాలని ఆదేశించిందని, దీంతో తాను ప్రధాని నరేంద్ర మోదీకి మెమో అందజేశానని ఆయన చెప్పారు.