Terrace: తండ్రి పెట్టే హింసను తట్టుకోలేక టెర్రెస్ పై నుంచి దూకిన వందన... వీడియో!

  • బాలికను హింసిస్తున్న సంతోష్
  • టెర్రెస్ పై నుంచి దూకడంతో గాయాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ 12 సంవత్సరాల బాలిక టెర్రెస్ పై నుంచి దూకిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. వందన అనే బాలికను భవంతిపైకి తీసుకెళ్లిన ఆమె తండ్రి సంతోష్, పదే పదే చెప్పుతో కొడుతూ ఉంటే, ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు టెర్రెస్ పై నుంచి ఆమె దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్ ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News