Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు నిజం తెలుసు... వెయిట్ అండ్ సీ ది గేమ్: నటి మాధవీ లత

  • తెలిసీ ఇన్నాళ్లూ స్పందించలేదు
  • ఇప్పుడు తప్పదన్న పరిస్థితుల్లోనే స్పందించారు
  • ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం బయటకురానుంది
  • తాను ఎదురు చూస్తున్నానన్న మాధవీ లత

టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై పవన్ కల్యాణ్ కు నిజం తెలుసునని నటి మాధవీ లత వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ తెలిసీ స్పందించని ఆయన, ఇప్పుడు తప్పదన్న పరిస్థితుల్లోనే స్పందించారని చెప్పింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ,  "పవన్ కల్యాణ్ కు నిజం తెలుసు. ఇన్నాళ్లూ స్పందించలేదు. ఇప్పుడు కూడా తప్పదు కనుక ఈ విషయంలో నోరు విప్పారు. చాలా త్వరలో పవన్ కల్యాణ్ కు తెలిసిన నిజం ఏంటో బయటకు వస్తుంది. వెయిట్ అండ్ సీ ది గేమ్. నేను కూడా నిజం కోసం ఎదురు చూస్తున్నాను.

 ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం... పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ స్పందించక పోవడానికి వెనుక ఉన్న నిజం... ఏంటి ఫ్యాన్స్... మీకే చెబుతున్నా... పవన్ కల్యాణ్ మీరు అనుకునేంత తెలివి తక్కువ పర్సన్ కాదు. ఇవాళ స్పందన తప్పదు కనుక చెప్పారు. అతి త్వరలోనే నిప్పులాంటి నిజాలు వస్తాయ్... నేను ఎదురు చూస్తున్నా" అని చెప్పుకొచ్చింది.

Pawan Kalyan
Tollywood
Cating Couch
Madhavi Latha
  • Error fetching data: Network response was not ok

More Telugu News