punam kaur: దేశంలో ఇప్పుడు జరుగుతున్నవి రెండే పోరాటాలు.. ఒకటి ఓటు కోసం.. రెండోది నోటు కోసం: నటి పూనమ్ కౌర్

  • దేశంలో వ్యవసాయం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు
  • చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటా
  • ఆయన చలువతోనే నిఫ్ట్ వంటి సంస్థలో చదువుకోగలిగా

ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం రెండే రెండింటి కోసం పోరాటాలు జరుగుతున్నాయన్నారు. అందులో ఒకటి ఓటు కోసం కాగా, రెండోది నోటు కోసమని అన్నారు. ఈ రెండింటి గురించి తప్ప మరి దేని గురించి ఎవరూ మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, సంస్కృతి గురించి పట్టించుకునే వారే కరువయ్యారన్నారు.

ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆయన వల్లే తాను ‘నిఫ్ట్’ వంటి విద్యాసంస్థలో చదువుకోగలిగానని, ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటానన్నారు. చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవమని, హైదరాబాద్‌కు ఉన్నత విద్యాసంస్థలను తీసుకొచ్చింది ఆయనేనని పూనమ్ అన్నారు. 

punam kaur
Andhra Pradesh
Chandrababu
vote
  • Loading...

More Telugu News