Andhra Pradesh: ఏపీలో ప్రారంభమైన బంద్.. రోడ్డెక్కిన నేతలు.. బయటకు రాని బస్సులు.. టీడీపీ దూరం

  • ప్రత్యేక హోదా డిమాండ్‌తో బంద్‌కు పిలుపునిచ్చిన హోదా సాధన సమితి
  • ఉదయం ఐదు గంటలకే బస్టాండ్లలో ధర్నాలు ప్రారంభం
  • నిరసనలు శాంతియుతంగా తెలపాలన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్ ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయగా, పాటిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు. నేటి ఉదయం ఐదు గంటల నుంచే బస్టాండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన ఒకటీఅరా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.  

ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్‌కు టీడీపీ దూరంగా ఉంది. ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే బంద్‌కు దూరంగా ఉంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే, ఎందుకోసమైతే బంద్ నిర్వహిస్తున్నారో అందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఢిల్లీలో ఆందోళన చేపడితే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News