Tollywood: శ్రీరెడ్డి నిజాయతీని ఎదుర్కోలేక కొందరు పురుషులు వణికిపోతున్నారు: దర్శకుడు వర్మ

  • శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమెపై అసూయపడుతున్నవారే
  • నిజాయతీ ఉన్న మహిళలు మాత్రమే శ్రీశక్తికి మద్దతుగా ఉంటారు
  • శ్రీరెడ్డి కూడా అశోకుడిలా గొప్ప వ్యక్తి

నటి శ్రీశక్తి (శ్రీరెడ్డి) అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోమారు స్పందించారు. ‘శ్రీరెడ్డి నిజాయతీని ఎదుర్కోలేక కొందరు పురుషులు వణికిపోతున్నారని అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమెపై అసూయపడుతున్నావారేనని, నిజంగా నిజాయతీ ఉన్న మహిళలు మాత్రమే శ్రీశక్తికి మద్దతుగా ఉంటారని అభిప్రాయపడ్డారు.

కాగా, శ్రీశక్తి గతాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపైనా వర్మ స్పందించారు. ఈ సందర్భంగా అశోక చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. నాడు అశోకుడు అనేక మందిని చంపాడని, ఆ తర్వాత మనసు మార్చుకుని లక్షల మందిని కాపాడాడని, ఆ విధంగా చూస్తే, శ్రీరెడ్డి కూడా అశోకుడిలా గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. కాగా, గతంలో వర్మ చేసిన ట్వీట్లలో శ్రీరెడ్డిని ఝాన్సీ లక్ష్మీ బాయ్ లా పోరాడిందని కితాబిచ్చారు.

Tollywood
ram gopal varma
srireddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News