kanche ilaiah: ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసింది : ప్రొఫెసర్ కంచె ఐలయ్య

  • 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా సీట్లు రాకూడదు
  • అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి
  • అంబానీ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు కల్పించాలి
  • తెలంగాణలో టీమాస్ లా ఏపీలో కూడా ఏర్పాటు చేయాలి

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని  ప్రొఫెసర్ కంచె ఐలయ్య విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా సీట్లు రాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. గత అక్టోబర్లో ప్రభుత్వం తనను విజయవాడ రానీయకుండా చేసిందని, దళిత, బహుజన మేధావులు రాజకీయ శక్తి నిర్మాణం ఏర్పాటు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.

ప్రత్యేకహోదా ఉద్యమంతో పాటు సామాజిక న్యాయంపై కూడా పోరాటం జరగాలని, అంబానీ కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తెలంగాణలో టీమాస్ లా ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ మాస్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

kanche ilaiah
Vijayawada
bjp
  • Loading...

More Telugu News