Telugudesam: అవినీతి కేసుల్లో నిందితుడు జగన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ : బోండా ఉమ

  • జగన్ పై మండిపడ్డ టీడీపీ నేత బోండా
  • రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తారా?
  • అవినీతి సంఘానికి అధ్యక్షుడు జగన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న చంద్రబాబును అరెస్ట్ చేయాలా? అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతి కేసుల్లో రాజీ కోసం బీజేపీతో అంటకాగుతున్న జగన్, ఆ పార్టీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఏ రోజైనా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతూ, ఆడమన్నట్టు ఆడుతున్న జగన్, ఆ పార్టీలో పావులా మారాడని విమర్శించారు. అవినీతి కేసుల్లో నిందితుడైన జగన్ చరిత్ర బీబీసీలో కూడా ప్రసారమైందని, అవినీతి సంఘానికి అధ్యక్షుడైన ఆయన  ఈ రాష్ట్రంపై విషం కక్కుతున్నాడని దుయ్యబట్టారు.

Telugudesam
bonda uma
Jagan
  • Loading...

More Telugu News