MAA: శివాజీ రాజా! మీ టోకెన్ నంబర్ వచ్చేసింది: శ్రీరెడ్డి

- 'మా' పెద్దలు వేధించారన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రుతి
- టీవీ చానల్ చర్చలో పాల్గొని ఆరోపణలు
- సమాధానం చెప్పాలని శివాజీ రాజాకు శ్రీరెడ్డి డిమాండ్
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పెద్దలు కూడా లైంగికంగా వేధించే వారేనని, మా అసోసియేషన్ లోనూ వేధింపులకు పాల్పడే వారు ఉన్నారని, ఎవరైనా దొరికితేనే దొంగలని క్యారెక్టర్ నటి శ్రుతి ఓ టీవీ చానల్ చర్చలో ఆరోపించిన నేపథ్యంలో నటి శ్రీరెడ్డి స్పందించింది.
"ది గ్రేట్ మా అధ్యక్షుడు శివాజీ రాజా గారూ... మీ టోకెన్ నంబర్ వచ్చింది. పదిమందికి న్యాయం చేయాల్సిన కుర్చీలో ఉండి ఈ రాసలీలలు ఏంటండీ?" అని ప్రశ్నించింది.
