Jana Sena: జనసేనలో చేరనున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించిన కాపు వర్గం నేత ముద్రగడ

  • జనసేనలో చేరాలని ఎన్నడూ అనుకోలేదు
  • పవన్ సీజనల్ ఉద్యమాలు పక్కనబెట్టాలి
  • అప్పుడే రాజకీయాల్లో రాణిస్తారన్న ముద్రగడ

తాను ఇంతవరకూ జనసేన పార్టీలో చేరాలని ఎన్నడూ అనుకోలేదని కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేనలో తానేమీ చేరబోవడం లేదన్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు పక్కనబెట్టి, సీజనల్ ఉద్యమాలు మానేయాలని కోరారు. పూర్తి స్థాయి రాజకీయ నేతగా పవన్ మారితేనే రాజకీయాల్లో రాణించి పై స్థాయికి చేరుకుంటారని, లేకుంటే తన అన్నలా కుప్పకూలిపోతారని అభిప్రాయపడ్డారు. నాలుగు దశాబ్దాలుగా కాపులు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని, రాజకీయ నేతలు వారిని మభ్యపెడుతూ కాలం గడుపుకుంటూ వెళుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కాపులకు అన్యాయం చేశారని విమర్శించారు.

Jana Sena
Pawan Kalyan
Mudragada
  • Loading...

More Telugu News