Sri reddy: మీరెంతో మేమూ అంతే... ప్రత్యేక హోదా కోసం కేసెందుకు పెట్టలేదు?: పవన్ కల్యాణ్ కు శ్రీరెడ్డి సూటి ప్రశ్న

  • వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు
  • శ్రీరెడ్డికి సూచించిన పవన్ కల్యాణ్
  • మీరు ఎందుకు స్టేషన్ కో, కోర్టుకో వెళ్లలేదు?
  • ఎదురు ప్రశ్నించిన శ్రీరెడ్డి

టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పవన్ కల్యాణ్ స్పందిస్తూ, శ్రీరెడ్డి నిరసన తీరు తప్పని, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలియజేస్తున్న పవన్, కోర్టుకు లేదా పోలీసు స్టేషన్ కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించింది.

"పీకేజీ... ఆంధ్రా కోసం మీరెందుకు నిరసనలు తెలియజేస్తున్నారు? హోదా కోసం పోలీసు స్టేషన్ కో, కోర్టుకో వెళ్లవచ్చుకదా? మేము కూడా మీలానే. తెలుగు అమ్మాయిల స్వాతంత్రం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం పోరాడుతున్న వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా? అమ్మాయిలు ఎవరూ పీకేల సపోర్టు కోరుకోవడం లేదు. మీరేమీ బలవంతంగా నోరు తెరచి మాట్లాడక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి ఇది సిగ్గు చేటు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో వ్యాఖ్యానించింది.

Sri reddy
Pawan Kalyan
Tollywood
Special Category Status
  • Error fetching data: Network response was not ok

More Telugu News