Konidala Productions: నటి సునీతపైన, కొణిదల ప్రొడక్షన్స్ పైన కేసు పెడుతున్నా: కత్తి మహేష్

  • అత్యాచారం చేయబోయాడని కత్తి మహేష్ పై సునీత ఆరోపణ
  • ఆమెను కొణిదల ప్రొడక్షన్స్ రెచ్చగొట్టిందన్న కత్తి
  • రూ. 50 లక్షలకు పరువునష్టం దావా వేస్తున్నట్టు వెల్లడి

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సునీతపైన, ఆమెను రెచ్చగొట్టిన కొణిదల ప్రొడక్షన్స్ పైన కేసు పెట్టనున్నానని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వెల్లడించాడు. తాను అత్యాచారం చేయబోయానని క్యారెక్టర్ నటి సునీత ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, రూ. 50 లక్షలకు పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలిపాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, తనపై ఆరోపణలే నిజమైతే సునీత పోలీసు కేసు పెట్టాలని, అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయని అన్నాడు. కాగా, ఇటీవల ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సునీత, తాను ఓ అవకాశం కోసం కత్తి మహేష్ వద్దకు వెళ్లగా, ఆయన అత్యాచారయత్నం చేశాడని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Konidala Productions
Kathi Mahesh
Sunita
  • Loading...

More Telugu News