Coimbattore: రూ. 5 కోట్ల కరెన్సీతో కోవై 'ముత్తుమారియమ్మన్' అలంకరణ!
- కోయంబత్తూరులో కొలువైన ముత్తుమారియమ్మన్
- వైభవంగా పుత్తాండు ఉత్సవాలు
- అమ్మకు కరెన్సీతో అలంకరణను చూసి పులకిస్తున్న భక్తులు
కోయంబత్తూరులోని శ్రీ ముత్తుమారియమ్మన్ దేవాలయంలో తమిళ నూతన సంవత్సరాది 'పుత్తాండు' ఉత్సవాలు వైభవంగా జరుగుతుండగా, అమ్మవారిని రూ. 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. నాలుగు కోట్ల విలువైన రూ. 2 వేలు, రూ. 200 నోట్లు, కోటి రూపాయల విలువైన వజ్రాలు, ముత్యాలతో అమ్మవారిని అలంకరించగా, వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకుని పులకితులయ్యారు.
ఈ దేవాలయం చాలా పురాతనమైనదని, ఇక్కడి అమ్మకు పుత్తాండు సందర్భంగా నగదుతో అలంకరించడం పరిపాటని ఆలయ అధికారులు వెల్లడించారు. నేడు ప్రారంభించే ఏ పనైనా విజయవంతం అవుతుందని తమిళ ప్రజలు నమ్ముతుంటారు. కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని మీరూ చూడవచ్చు.