TTD: శైవక్షేత్రం ముట్టడికి బయలుదేరిన యాదవులు... అమరావతిలో ఉద్రిక్తత!

  • టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం
  • ఆయన నియామకాన్ని తప్పుబట్టిన శివస్వామి
  • యాదవ సంఘాల ఆగ్రహం.. పలువురి అరెస్ట్

టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన శివస్వామి తీరుకు నిరసనగా యాదవ సంఘాల నాయకత్వంలో వందలాది మంది శైవక్షేత్రం ముట్టడికి బయలుదేరిన వేళ, అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. తాళ్లాయపాలెంలో శైవక్షేత్రాన్ని శివస్వామి నిర్వహిస్తుండగా, దాన్ని ముట్టడించేందుకు యాదవులు కదిలివచ్చారు.

యాదవుల నిరసనలను ముందుగానే పసిగట్టిన పోలీసులు, వారిని అడ్డుకునేందుకు భారీ ఎత్తున మోహరించారు. ఉండవల్లి సెంటర్ లో యాదవ నిరసనకారులను అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు. శైవక్షేత్రానికి దారితీసే కరకట్ట రహదారిని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు ఆ దారిలో ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

TTD
Putta Sudhakar Yadav
Sivaswamy
Saivakshetram
Undavalli
Amaravati
  • Loading...

More Telugu News