Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • చిరంజీవి చిత్రంలో మిల్కీ బ్యూటీ 
  • నాగార్జున, నానిలకు హీరోయిన్ల ఖరారు 
  • రాజకీయాల గురించి మహేశ్

*  చిరంజీవి, నయనతార జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం 'సైరా'లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరుతోంది. సినిమాలో ఒక కీలకమైన పాత్రకు తమన్నాని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులో ఆమె విజయ్ సేతుపతికి జంటగా నటిస్తుందట.
*  నాగార్జున, నాని కలసి నటించే మల్టీ స్టారర్ లో కథానాయికలను ఫైనల్ చేశారు. ఇందులో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నాని పక్కన రష్మిక మండన నటిస్తారు. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
*  రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు ఏమాత్రం లేదని హీరో మహేశ్ బాబు స్పష్టం చేశాడు. తన తాజా చిత్రం 'భరత్ అనే నేను' విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహేశ్ రాజకీయాలను ప్రస్తావించాడు. రాజకీయాలు తనకు ఆప్షన్ కాదని, మంచి కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడమే తనకు ఇష్టమని చెప్పాడు. 

Thamanna
Nagarjuna
nani
  • Loading...

More Telugu News