Tollywood: పవన్ కల్యాణ్ మాటలతో హ్యాపీగా లేను: శ్రీరెడ్డి

  • పవన్ వ్యాఖ్యలు అసంతృప్తిని కలిగించాయి
  • ప్రజల దృష్టి నాపై పడాలని కోరుకోవడం లేదు
  • కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనకు అసంతృప్తిని కలిగించాయని, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. "పవన్ కల్యాణ్ సార్ స్టేట్ మెంట్ నాకేమీ ఆనందాన్ని కలిగించలేదు. అయితే ఇట్స్ ఓకే. ఇతర మహిళల రక్షణపై మాట్లాడటం, నన్ను తక్కువ చేయడం అర్థం కాలేదు. ఇట్స్ ఫైన్. నేనేమీ జలసీగా లేను. ప్రజల దృష్టి నాపై పడాలని నేనేమీ కోరుకోవడం లేదు. ఇతరుల మాదిరిగా నాకేమీ పాప్యులారిటీ అవసరం లేదు" అని వ్యాఖ్యానించింది.

అంతకుముందు మరో ట్వీట్ లో పవన్ కల్యాణ్ మహిళల సమస్యలపై మాట్లాడటం తనకు సంతోషాన్ని కలిగించిందని, ఆయన వంటి స్టార్స్ స్పందిస్తే అసాంఘిక కార్యకలాపాలపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

Tollywood
Casting Couch
Sri Reddy
Pawan Kalyan
  • Loading...

More Telugu News