Saina Nehwal: ఇండియా వర్సెస్ ఇండియా పోరులో సింధుపై నెగ్గిన సైనా

  • 21-18, 23-21 తేడాతో సింధుపై నెగ్గిన సైనా
  • రజతంతో సరిపెట్టుకున్న పీవీ సింధు
  • 26కు పెరిగిన స్వర్ణాల సంఖ్య

ఆసక్తికరంగా సాగిన కామన్వెల్త్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోరులో పీవీ సింధూపై సైనా నెహ్వాల్ గెలిచింది. ఆద్యంతం నువ్వా? నేనా? అన్నట్టు సాగిన ఈ పోటీలో సైనా నెహ్వాల్ 21-18, 23-21 తేడాతో సింధుపై వరుస సెట్లలో నెగ్గి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, సింధు రజతంతో సరిపెట్టుకుంది.

తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ మూడు పాయింట్ల తేడాతో సెట్ ను గెలిచి, ఆపై అదే జోరును రెండో సెట్లోనూ కొనసాగించింది. ఆటను మూడో సెట్ కు తీసుకువెళ్లేందుకు సింధూ శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ మ్యాచ్ తరువాత భారత్ ఖాతాలోకి 26వ స్వర్ణ పతకం చేరగా, రజత పతకాల సంఖ్య 17కు పెరిగింది.

Saina Nehwal
PV Sindhu
Commonwealth Games
  • Loading...

More Telugu News