IPL 2018: సన్ రైజర్స్ హ్యాట్రిక్ విజయం... రెండోసారీ ఓడిపోయిన నైట్ రైడర్స్!

  • ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్
  • 138 పరుగులు మాత్రమే చేసిన నైట్ రైడర్స్
  • మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించిన సన్ రైజర్స్

ప్రత్యర్థి జట్టు అదే... అయితే వేదిక మాత్రమే మారింది. ఫలితం మారలేదు. నాలుగు రోజుల క్రితం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించిన సన్ రైజర్స్ జట్టు, అదే ఊపుతో వారి హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్‌ లిన్‌ 34 బంతుల్లో 49 పరుగులతో ఒంటరి పోరు చేశాడు. భువనేశ్వర్‌ చెలరేగి పోయి 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత 139 పరుగుల సులభమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ జట్టు మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ జట్టు తానాడిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించి, 0.772 నెట్ రన్ రేటుతో పతకాల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది.

IPL 2018
Sunrisers
Kolkata Night Riders
  • Loading...

More Telugu News