suicide: తన మరణానికి ప్రియురాలు మౌనికే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి.. యువకుడి ఆత్మహత్య

  • వరంగల్ అర్బన్ జిల్లా ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • 25 ఏళ్ల కమలాకర్ కు భార్య, 4 ఏళ్ల కుమారుడు
  • మరో అమ్మాయితో ప్రేమాయణం.. గొడవ
  • బంధువులతో కలిసి వచ్చి చితక్కొట్టించిన ప్రియురాలు

తన మరణానికి తన ప్రియురాలే కారణమని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపి వివరాలు తెలిపారు. శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన 25 ఏళ్ల కమలాకర్ కు భార్య, 4 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

అయితే, కొంతకాలంగా రేపాకకు చెందిన అమ్మాయి మౌనికతో కమలాకర్ పరిచయం పెంచుకుని ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కమలాకర్ భార్య పుట్టింటికి వెళ్లింది. కాగా, ఇటీవల ప్రియురాలికి, కమలాకర్‌కు మధ్య గొడవ చెలరేగింది. కమలాకర్ ఓ చోట ఉన్నాడని తెలుసుకున్న అతడి ప్రియురాలు తన బంధువులతో కలిసి వచ్చి అతనిని చితక్కొట్టించి, అవమానించి, ఈ దృశ్యాలను స్మార్ట్‌ఫోన్‌లోనూ చిత్రీకరించింది. దీంతో మనస్తాపం చెందిన కమలాకర్ సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News