Mahanati: 'మహానటి' టీజర్‌ విడుదల

  • సావిత్రిగా కీర్తి సురేష్
  • 'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమవుతోన్న టీజర్‌
  • కీలక పాత్రలో సమంత

తెలుగు తెరపై నవరస నట నాయకిగా సావిత్రి తిరుగులేని కెరియర్ ను కొనసాగించారు. నట శిఖరాలుగా ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ .. వంటివారితో కలిసి ఆమె పండించిన పాత్రలు ఈనాటికీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటూనే వున్నాయి .. ఈ తరం వారిని సైతం ఆమె అభిమానులుగా మార్చేస్తూనే వున్నాయి. అలాంటి సావిత్రి జీవితం 'మహానటి' పేరుతో చిత్ర రూపాన్ని పొందింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. 'అనగనగా ఒక మహానటి' అంటూ ప్రారంభమవుతోన్న ఈ టీజర్‌ అలరిస్తోంది. సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  

Mahanati
Teaser
release
  • Error fetching data: Network response was not ok

More Telugu News