maa: 'మా' వేడుకలకు రండి సందడి చేద్దాం!: అమెరికాలోని తెలుగు వారికి మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

  • 'మా' ప్రారంభించి 25 సంవత్సరాలు
  • డల్లాస్‌లో వేడుకలు
  • 'మా' మరిన్ని మైలురాళ్లు దాటాలన్న చిరు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ను ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతోందని, ఈ సందర్భంగా 'మా' సిల్వర్ జూబ్లి వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని డల్లాస్‌ సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, ఇందులో తనతో పాటు చాలా మంది నటీనటులు పాల్గొంటారని, ఈ వేడుకలో అందరినీ ప్రత్యక్షంగా కలవబోతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

'మా' మరిన్ని మైలురాళ్లు దాటి భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రేక్షకుల సహకారం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ నెల 27, 28 తేదీల్లో ఈ వేడుకలు జరుగుతున్నాయి.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News