Balakrishna: వినాయక్ తో బాలకృష్ణ మూవీ .. వచ్చేనెల 12న లాంచ్?

  • బాలకృష్ణతో సి.కల్యాణ్ మరో సినిమా 
  • వినాయక్ కి ఓకే చెప్పిన బాలయ్య 
  • ఎన్టీఆర్ బయోపిక్ అయ్యాక సెట్స్ పైకి 

ఇటీవల బాలకృష్ణ హీరోగా సి.కల్యాణ్ నిర్మించిన 'జై సింహా' భారీ వసూళ్లను సాధిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చిలకలూరిపేటలో ఈ సినిమా 100 రోజులు ఆడేసింది. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ ను అక్కడే జరపాలని కల్యాణ్ భావించాడట. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే .. బాలకృష్ణతో మరో సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం.

వి.వి.వినాయక్ దర్శకుడిగా ఒక సినిమా చేద్దామని బాలకృష్ణతో కల్యాణ్ అంటే, కథ బాగుంటే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని బాలకృష్ణ అన్నారట. అందువలన మంచి కథను రెడీ చేయించే పనిలో వినాయక్ వున్నాడని అంటున్నారు. వచ్చేనెల 12న ఈ సినిమాను లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగు పూర్తయిన తరువాత వినాయక్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారని అంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ తదుపరి సినిమా వినాయక్ తో ఖాయమైపోయిందనే చెప్పాలి.     

  • Loading...

More Telugu News