sri reddy: ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను!: శ్రీరెడ్డి ప్రకటన

  • నా పేరులో 'రెడ్డి' ఇక ఉండదు
  • ఆ పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది
  • నా పేరు ఇక నుంచి శ్రీశక్తి 
  • ఓయూ విద్యార్థులతో కలిసి ఆడపిల్లల సమస్యలపై పోరాడతా

'ఈ రోజు నేను ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నాను.. అదేంటంటే నా పేరులో 'రెడ్డి' అని ఉన్న పదాన్ని మోయడం బరువుగా అనిపిస్తోంది.. నా పేరు ఇక నుంచి శ్రీరెడ్డి కాదు శ్రీశక్తి.. నా గురించి మీడియా రాసేటప్పుడుగానీ, చదివేటప్పుడుగానీ శ్రీశక్తి అనే రాయండి, చదవండి' అని నటి శ్రీరెడ్డి పేర్కొంది.

టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... 'నిర్మాత దిల్‌ రాజు చేతుల్లోంచి ఎప్పుడయితే థియేటర్లు బయటకు వస్తాయో అప్పటివరకు నేను శ్రీశక్తిగానే ఉంటాను. ఎవరి దగ్గరయితే మెజారిటీ థియేటర్లు ఉండిపోయాయో వారందరి చేతుల నుంచి బయటపడాలి. నేను చేసే ఉద్యమం ఇంత ఉద్ధృతం అవుతుందని నేను ఊహించలేదు. ఇంకొంత మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఓయూ విద్యార్థులను కలుపుకువెళతాము. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లి వారికి న్యాయం జరిగేలా చేస్తాం' అని శ్రీ రెడ్డి పేర్కొంది.

sri reddy
ou
Tollywood
Sri Sakthi
  • Loading...

More Telugu News