vaishnav tej: హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు .. నిర్మాతగా సాయి కొర్రపాటి

  • మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజు 
  • రంగంలోకి ఆయన తమ్ముడు 
  • దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్

మెగాస్టార్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్, మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. నటనలోనూ .. డాన్సుల్లోను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. కొంతకాలంగా ఈ విషయంపై జరుగుతోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెబుతున్నారు.

అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఒక వైపున చిరంజీవి చిన్నల్లుడి సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి, మరో వైపున మెగాస్టార్ మరో మేనల్లుడిని పరిచయం చేస్తుండటం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక .. ఎక్కువ సమయం తీసుకోకుండానే దూసుకుపోయాడు. అలా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి.     

vaishnav tej
sai korrapati
  • Loading...

More Telugu News