keerthi suresh: 'మహానటి' నుంచి కీర్తి సురేశ్ ఫస్టులుక్... అదిరింది!

  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' 
  • సావిత్రిగా కనిపించనున్న కీర్తి సురేశ్
  • మరికొంత సేపట్లో టీజర్ రిలీజ్

తెలుగు తెరకి నిండుదనం ... నవరస నటనతో పండుగదనం తీసుకొచ్చిన కథానాయిక సావిత్రి. విశాలమైన కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసానికి అభిమానులు ఎందరో. అలాంటి సావిత్రి జీవితంలో ఎన్నో ఆనందాలు .. మరెన్నో విషాదాలు వున్నాయి. ఆమె జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది.

 సావిత్రి లుక్ లో కీర్తి సురేశ్ ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఒక్కసారిగా చూస్తే నిజంగానే ఇది సావిత్రి ఫోటోనే అనుకునేట్టుగా ఈ ఫస్టులుక్ వుంది. సావిత్రి లుక్ తో కీర్తి సురేశ్ ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

  • Loading...

More Telugu News