comedian: బాలీవుడ్ హాస్య నటుడు రాజ్ పాల్ యాదవ్ ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం

  • సినీ నిర్మాణం పేరిట 5 కోట్లు అప్పు తీసుకున్న రాజ్ పాల్ యాదవ్
  • వడ్డీతో కలిపి ఇప్పుడు 8 కోట్లకు చేరిన అప్పు
  • చెల్లించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితుడు

రవితేజ నటించిన 'కిక్-2' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌ పాల్ యాదవ్‌ ను, ఆయన భార్య రాధను ఢిల్లీలోని 'కర్ కర్ డూమా' కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ నెల 23న వీరికి శిక్షను ప్రకటిస్తామని తెలిపింది.

దాని వివరాల్లోకి వెళ్తే... ‘భూల్‌ భులయ్యా’, ‘పార్టనర్’, ‘హంగమా’ వంటి సినిమాలతో మంచి హాస్య నటుడిగా పేరుతెచ్చుకున్న రాజ్ పాల్ యాదవ్, అతని భార్య రాధ 2010లో ఒక హిందీ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన వ్యాపారి ఎం.జి.అగర్వాల్ వద్ద 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. బాకీ తీర్చకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, వారు తీసుకున్న బాకీ ఇప్పుడు 8 కోట్ల రూపాయలకు చేరిందని తెలుస్తోంది.

గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో రాజ్ పాల్, రాధలకు న్యాయస్థానం ఆరురోజుల జైలు శిక్ష విధించడమే కాకుండా, ముంబైలోని మలాడ్ లోని యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఖాతాతో పాటు, కంపెనీ అకౌంట్ ను స్తంభింపజేసింది.

  • Loading...

More Telugu News