srinivas reddy: 'జంబ‌ల‌కిడి పంబ' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • మళ్లీ తెరపైకి 'జంబలకిడి పంబ' 
  • ప్రధాన పాత్రల్లో శ్రీనివాస రెడ్డి .. సిద్ధి ఇద్నాని
  • దర్శకుడిగా మురళీకృష్ణ  

తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించిన విభిన్నమైన కథా చిత్రాలలో, ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన 'జంబలకిడి పంబ' ఒకటి. 1993లో వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఘన విజయాన్ని అందుకుంది. అదే టైటిల్ తో ఇప్పుడు మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస రెడ్డి .. సిద్ధి ఇద్నాని ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

 హీరోయిన్ మగరాయుడిలా సిగరెట్ పట్టుకుని రఫ్ లుక్ తో కనిపిస్తుంటే, అమ్మాయిలా కాస్తంత సిగ్గుపడుతూ లిప్ స్టిక్ చేసుకుంటూ హీరో కనిపిస్తున్నాడు. చూస్తుంటే .. స్త్రీలంతా పురుషులుగా .. పురుషులంతా స్త్రీలుగా ప్రవర్తించే పాత కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ పాత కాన్సెప్టును దర్శకుడు మురళీకృష్ణ కొత్తగా ఎలా చెప్పనున్నాడు అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'గీతాంజలి' .. 'ఆనందో బ్రహ్మ' వంటి సినిమాలతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీనివాసరెడ్డికి, ఈ సినిమా మరింత క్రేజ్ ను తీసుకొస్తుందేమో చూడాలి.          

srinivas reddy
siddhi idnani
  • Error fetching data: Network response was not ok

More Telugu News