singer attacked: పంజాబీ సింగర్ పై కాల్పులు.. కాలిలోకి దూసుకెళ్లిన తూటా!

  • ‘గాల్ నహీన్ కదానే’ పాటతో పాప్యులర్ అయిన పర్మిష్‌ 
  • ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో కాల్పులు
  • ఆసుపత్రిలో చేర్చిన స్థానికులు

‘గాల్ నహీన్ కదానే’ పాటతో పాప్యులర్ అయిన పంజాబీ సింగర్ పర్మిష్‌ వర్మపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరపడం పంజాబ్ లో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న రాత్రి మొహాలిలోని తన ఇంటికి పర్మిష్ వర్మ వెళ్తుండగా సెక్టర్‌ 91 సమీపంలోకి వచ్చేసరికి ఆయనపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు.

ఈ క్రమంలో ఆయన కాలిలోకి ఒక తూటా దూసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు సకాలంలో స్పందించి, అక్కడికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. వెంటనే స్థానికులు ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

singer attacked
mohali
parmish verma
  • Loading...

More Telugu News