chaitu: 'సవ్యసాచి' స్పెషల్ సాంగులో మెరవనున్న రకుల్!

  • చైతూ హీరోగా 'సవ్యసాచి'
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • 'అల్లరి అల్లుడు'లోని హిట్ సాంగ్ రీమిక్స్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ వుంటే బాగుంటుందని భావించిన చందూ మొండేటి, 'అల్లరి అల్లుడు' సినిమాలోని 'నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు' పాటను రీమిక్స్ చేయనున్నట్టుగా సమాచారం.

 అప్పట్లో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సాంగును, ఈ సినిమాలో  స్పెషల్ సాంగ్ గా ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కాజల్ .. తమన్నా .. శ్రుతి హాసన్.. రాశి ఖన్నా .. ఐటమ్ సాంగ్స్ చేసేసి వున్నారు. అందువలన ఫ్రెష్ ఫీల్ రావడం కోసం రకుల్ ను ఈ పాట కోసం సంప్రదిస్తున్నారట. ఆమె అంగీకరించడం .. ఈ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       

  • Error fetching data: Network response was not ok

More Telugu News