ram gopal varma: సినీ పరిశ్రమలో కోఆర్డినేటర్ అనే వాడు ముమ్మాటికీ బ్రోకరే!: రామ్ గోపాల్ వర్మ

  • కోఆర్డినేటర్లు అంటే బ్రోకర్లే
  • అమ్మాయిలు వాడితో కూడా కాంప్రమైజ్ కావాలి
  • కాంప్రమైజ్ అయ్యే అమ్మాయిల లిస్టును డైరెక్టర్లకు పంపుతారు

సిని పరిశ్రమలో వేళ్లూనుకున్న కో-ఆర్డినేటర్ వ్యవస్థ గుట్టు విప్పారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీలో కో-ఆర్డినేటర్ అంటే ముమ్మాటికీ బ్రోకరేనని తేల్చి చెప్పారు. కొన్ని వందల మంది అమ్మాయిలను ఈ కోఆర్డినేటర్లు హ్యాండిల్ చేస్తారని చెప్పారు. దర్శకులకు అమ్మాయిల లిస్టును పంపుతుంటారని... 50 మంది ఫొటోలను పంపితే, అందులో కాంప్రమైజ్ కు సిద్ధంగా ఉన్న 10 మంది అమ్మాయిలను ఓ సెపరేట్ కేటగిరీలో పెడతారని తెలిపారు. ప్రతి ఒక్క డైరెక్టర్ కు కోఆర్డినేటర్లు ఇలాగే పంపుతారని చెప్పారు.

ఒక అమ్మాయి సినిమాల్లోకి రావాలంటే... ఈ కోఆర్డినేటర్ అనే వాడితో కూడా కాంప్రమైజ్ కావాల్సిందేనని తెలిపారు. ఇక్కడ కోఆర్డినేటర్ అనేది ఒక జాబ్ అని... దానికి  టాలెంట్, డబ్బు అవసరం లేదని ... డబ్బుకోసం ఇతరులు వేర్వేరు పనులు చేస్తున్నట్టే, కోఆర్డినేటర్ కూడా వాడి పని వాడు చేస్తాడని వర్మ తెలిపారు. 

ram gopal varma
Tollywood
film industry
cooordinator
broker
actress
women
  • Loading...

More Telugu News