Jagan: అశేష జనసందోహం మధ్య విజయవాడలోకి ప్రవేశించిన జగన్.. ఫొటోలు చూడండి

  • ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
  • బందరు రోడ్డుకు చేరుకున్న పాదయాత్ర
  • చిట్టినగర్ లో బహిరంగసభ

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనకదుర్గ వారధి వద్ద వైసీపీ శ్రేణులు పోటెత్తారు. జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అశేష జనసందోహం మధ్య ఆయన నగరంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర బందరు రోడ్డుకు చేరుకుంది.

ఈరోజు ఆయన కనకదుర్గవారధి గుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి, వెటర్నరీ ఆసుపత్రి సెంటర్, శిఖామణి సెంటర్, పుష్పా హోటల్ సెంటర్, సీతారాంపురం సెంటర్, కొత్త వంతెన, బీఆర్టీఎస్ రోడ్డు, మీసాల రాజారావు రోడ్డు, ఎర్రకట్ట, చిట్టినగర్ వరకు పాదయాత్ర చేస్తారు. చిట్టినగర్ సెంటర్ లో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్ద ఈరోజు యాత్ర ముగుస్తుంది.

అంతకు ముందు ఆయన అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.

Jagan
YSRCP
pada yatra
Vijayawada
  • Error fetching data: Network response was not ok

More Telugu News