Cricket: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆల్ అవుట్... బెంగళూరు లక్ష్యం 156

  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పతనాన్ని శాసించిన బౌలర్లు
  • మూడు వికెట్లతో చెలరేగిన ఉమేష్ యాదవ్
  • రెండేసి వికెట్లు తీసిన వోక్స్, ఖెజ్రోలియా, వాషింగ్టన్ సుందర్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు ఆకట్టుకున్నారు. సమష్టిగా రాణించి పంజాబ్ జట్టును ఆలౌట్ చేశారు. నిప్పులు చెరిగే బంతులతో ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని ఉమేష్ యాదవ్ శాసించగా, అతనికి వోక్స్, ఖెజ్రోలియా, వాషింగ్టన్ సుందర్, చాహల్ సహకరించారు. 19.2 ఓవర్లలో లోకేష్ రాహుల్ (47), కరుణ్ నాయర్ (29), కెప్టెన్ ఇన్నింగ్స్ తో రవిచంద్రన్ అశ్విన్ (33) రాణించడంతో జట్టు 155 పరుగులు చేసింది. 156 పరుగుల విజయ లక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఆరంభించనుంది. 

Cricket
ipl
rcb
kings elleven punjab
  • Loading...

More Telugu News