Pawan Kalyan: ఆయన భారతీయుడిగా జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం: పవన్

  • రేపు అంబేద్కర్‌ జయంతి
  • వినమ్రంగా అంజలి ఘటిస్తున్నానన్న జనసేనాని
  • రేపు దివ్యాంగుల క్రికెట్ పోటీలకు హాజరవుతాని ప్రకటన

'రాజ్యాంగ పితామహుడు బీఆర్‌ అంబేద్కర్‌ భారతీయుడిగా జన్మించడం ప్రతి భారతీయుడు చేసుకున్న అదృష్టం. దూరదృష్టితో మన రాజ్యాంగానికి రూపకల్పన చేయడంతో పాటు దేశంలో విద్యా వ్యాప్తికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. రేపు ఆయన జయంతి సందర్భంగా నా తరఫున, పార్టీ తరఫున తయనకు వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రేపు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా తమ పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో గడుపుతానని, అనంతరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న దివ్యాంగుల క్రికెట్ పోటీలకు హాజరు అవుతానని అన్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్ కల్యాణ్‌ని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు, క్రీడాకారులని పవన్ కల్యాణ్ అభినందించి, ఈ పోటీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. ఈ పోటీల్లో 24 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటాయి.   

  • Loading...

More Telugu News