airtel: ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... ఉచితంగా 30జీబీ డేటా!

  • 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్' పేరిట కొత్త ఆఫర్
  • 2జీ / 3జీ స్మార్ట్‌ఫోన్‌ నుండి 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్ గ్రేడ్ అయిన వారు అర్హులు
  •  51111 టోల్ ఫ్రీ నంబర్ లేదా airtel.in/4gupgrade వెబ్‌సైట్‌లో అర్హతను చెక్‌ చేసుకోవాలి

ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం 'మేరా పెహలా స్మార్ట్‌ఫోన్' పేరిట బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా 2జీ లేదా 3జీ ఫోన్లు వాడుతున్న ఎయిర్‌టెల్ వినియోగదారులు 4జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్ గ్రేడ్ అయితే 30 జీబీ డేటాను ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులైతే రోజుకి 1జీబీ చొప్పున 30 రోజులకు 30 జీబీ రానుండగా, ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఒకేసారి 30 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. అయితే ఈ ఉచిత ఆఫర్ కి మీరు అర్హులా? కాదా? అని తెలుసుకోవడానికి మీ మొబైల్ నుండి 51111 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి, లేదా airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.

airtel
Tech-News
Andhra Pradesh
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News