deve gouda: పీపుల్స్ ఫ్రంట్‌కు సహకరిస్తాం.. ఇది మూడో ఫ్రంట్ కాదు: కేసీఆర్‌తో భేటీ తరువాత దేవేగౌడ
- 70 ఏళ్లుగా దేశం సమస్యలు ఎదుర్కొంటోంది
- వాటి పరిష్కారానికి కేసీఆర్ ముందడుగు వేశారు
- తెలంగాణలో వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారు
- మాది పథకాల ఆధారిత ఫ్రంట్
తమది ఎవరినో గద్దె దించడానికి ఏర్పాటు చేస్తోన్న ఫ్రంట్ కాదని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. ఈ రోజు బెంగళూరులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందడుగు వేశారని, తాము పీపుల్స్ ఫ్రంట్‌కు సహకరిస్తామని ఆయనతో చెప్పామని అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కార్యక్రమం చేపట్టారని దేవేగౌడ ప్రశంసించారు. తమది మూడో ఫ్రంట్, నాలుగో ఫ్రంట్ కాదని పథకాల ఆధారిత ఫ్రంట్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలను తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు.